Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి కౌన్సిలర్ సాయం

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి కౌన్సిలర్ సాయం

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణంలోని సాయి నగర్ కాలనీలో అనుకోకుండా జరిగిన అగ్నిప్రమాదంలో రూ. 2 లక్షలు నగదు, మూడు తులాల బంగారు నిత్యవసర సరుకులు పూర్తిగా కాలిపోయి, రాములు శాంతమ్మ  కుటుంబం తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి నగర్ కాలనీ కౌన్సిలర్  సుంకరి నిర్మల బాలరాజ్ బాధితులకు అండగా నిలిచారు. శనివారం ఇంటి నిర్మాణం కోసం 30 బస్తాల సిమెంట్, 50 కిలోల బియ్యం, చాప 2 రగ్గులు, 5 చీరలు వారికి అందజేశారు.

సిలిండర్ పేలి అగ్నిప్రమాదం జరగడంతో రెవెన్యూ అధికారులతో పంచినామా నిర్వహించారు. భారత్ గ్యాస్ నిర్వాహకులు అధికారులు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. నూతనంగా గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వాలన్నారు. భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సానుకూలంగా స్పందించినట్లు బాలరాజు తెలిపారు. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు హౌసింగ్ శాఖ అధికారులు ఇందిరమ్మ బిల్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లింగమయ్య, రాజు, మహేష్ , సత్యనారాయణ, సురేష్, శేఖర్  అరవింద్ సుంకరి ఆంజనేయులు, ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -