శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని శ్రీరామగిరి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి బ్లీచింగ్ పౌడర్ ప్యాకెట్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ తెలిపారు. ఆదివారం ఉపసర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్* మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో దోమలు మరియు ఇతర కీటకాల వ్యాప్తిని నియంత్రించడం కోసం బ్లీచింగ్ పౌడర్‌ను వినియోగించాలని ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. వర్షాకాలంలో ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజల ఆరోగ్యం మరియు గ్రామ పారిశుధ్యానికి గ్రామపంచాయతీ ప్రాధాన్యత ఇస్తుందని తెలపాడు, వర్షాకాలంలో వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామగిరి సుమన్, వార్డు సభ్యులు, గొల్లపెల్లి వేణు, రామగిరి భీమలత, సంద లలిత కృష్ణ గ్రామ ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.



