Sunday, August 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మీ ఓటు.. మీ హక్కు.!

మీ ఓటు.. మీ హక్కు.!

- Advertisement -

ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు  ఒక్కరోజే గడువు
మల్హర్ లో 91 శాతం డిజిటలైజ్
నవతెలంగాణ – మల్హర్ రావు

మంథని నియోజకవర్గ పరిధిలో మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐర్) డిజిటైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.ఇంటింటికీ పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి సేకరించడానికి బీఎల్ ఓలు క్షేత్ర స్థాయిలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. బూత్ల వారీగా ఉన్న ఓటర్లు,పత్రాలను లెక్కల్లోకి తీసుకొని ప్రతీ దానినీ ఆన్లైన్ చేయాల్సి ఉండగా..కొన్నిచోట్ల ఓటర్ల నుంచి స్పందన లేదని, మరికొన్ని చోట్ల బీఎల్ ఓలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

‘సర్’ పైనే దృష్టి..
ఈనెల 10వ తేదీ వరకే గడువు ఎన్నికల యంత్రాంగం ఉండడంతో పూర్తిగా ‘సర్’ ప్రక్రియ పైనే దృష్టి సారించింది.మండల తహసీల్దార్ పరిధిలోని 24 బూత్ లల్లో 91 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది.అయితే ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వని వారి ఇళ్లకు కనీసం మూడు సార్లు వెళ్లాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆదిశగా బీఎల్ఓలు కృషి చేస్తున్నారు.అయితే కొందరు అందుబాటులో లేకపోవడం,ఇళ్లకు తాళాలు వేసి ఉండటం,ఫోన్లలో స్పందించకపోవడంతో తీవ్ర జాప్యం జరుగుతోందని బీఎల్ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నగరమా..?..గ్రామమా..?
నగరంలో నివాసముంటున్న వారిలో చాలా మందికి సొంత గ్రామాల్లోనూ ఓట్లు ఉన్నాయి.ఓటు నగరంలో ఉంచుకోవాలా? గ్రామంలో ఉంచుకోవాలా? అనే మీమాంసలో కొందరున్నారు.గ్రామాల్లో ఆస్తులు ఉన్నవారు అక్కడే పేర్లు ఉంచేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికై నా ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పిస్తేనే ఓటు హక్కు ఉంటుందని లేనిపక్షంలో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మండల ‘సర్’ ప్రక్రియ వివరాలు..

మొత్తం పోలింగ్ బూత్లు…24

మొత్తం ఓటర్లు…22,524

డిజిటలైజ్ చేసినని…20,538

డిజిటలైజేషన్ శాతం..91

అన్-ఎన్యుమరేటెడ్…20,537

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -