– సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి..
నవతెలంగాణ – తొగుట
సొసైటీ డైరెక్టర్ లింగాల నర్సవ్వ అకాల మరణం చాలా బాధాకరమని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని తుక్కా పూర్ గ్రామానికి చెందిన లింగాల నరసవ్వ 2020 ఫిబ్రవరిలో జరిగిన సహ కార సంఘం ఎన్నికలలో తుక్కాపూర్ నుండి ఏకగ్రీ వంగా డైరెక్టర్గా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. లింగాల నరసవ్వ అకాల మరణం తీవ్రంగా కలిసి వేసిందని ఆమె గత రాత్రి అనారోగ్యంతో మరణిం చడం బాధాకరం అన్నారు. తుక్కాపూర్ స్వగృహం లో లింగాల నర్సవ్వ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూ తి తెలిపారు. మృతురాలు కుటుంబానికి పాలకవర్గం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సొసైటీ డైరెక్టర్గా తమ పాలకవర్గంలో అందరి తో కలుపుగోలుగా ఉండేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కురుమ యాద గిరి, డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, సీఈఓ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సొసైటీ డైరెక్టర్ లింగాల నర్సవ్వ మృతి బాధాకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



