- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం ఇప్పలపల్లి గ్రామపరిదిలోగల కేశారంపల్లికి చెందిన పోచంపల్లి లింగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం 11వ రోజు కావడంతో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి బాధిత కుటుంబానికి రూ.3 వేలు ఆర్థిక సాయం చేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అక్కల దేవేందర్ యాదవ్, అబ్బినేని తిరుపతి, అశోక్, అక్కల బాపు, రాము, నితిన్, పోచంపల్లి కత్తెరసాల, తులసూరి రమేష్, నూనేటి లింగన్న పాల్గొన్నారు.
- Advertisement -



