- Advertisement -
నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండలంలోని రాంపూర్ గడ్డ గ్రామ శివారులో ఉన్న రైస్ మిల్ లో హమాలీలుగా పనిచేస్తున్న బీహార్, ఉత్తర ప్రదేశ్ చెందిన ముగ్గురు వలస కూలీలు శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాల్లోకి వెలితే.. రాత్రి 10:30 ప్రాంతంలో రైస్ మిల్ నుండి ఒకే బైక్ పై ముగ్గురు (లాల్తూర్ ముఖ్య,రాహుల్, నరేష్ ) రాంపూర్ గడ్డ రైస్ మిల్ నుండి గాంధారికి వస్తున్న క్రమంలో రాంపూర్ గడ్డ కల్వట్ వద్ద బైక్ అతివేగం వల్ల అదుపుతప్పి కల్వెట్ కు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. పొట్టకూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అయ్యో పాపం అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



