Sunday, March 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మైనింగ్ అక్రమాలపై చర్చకు అవకాశం ఇచ్చామని, సీఐడీ విచారణకు ఆదేశించామని అసెంబ్లీలో తెలిపారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై విచారణను అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని హరీశ్‌రావు బంధువులు చేసిన భూ దోపిడీ, అక్రమాలపై హౌస్‌ కమిటీ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు.‘‘బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలు ఆరోపించారు. సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో విచారణ చేస్తారని చెప్పారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీబీఐకి ఇచ్చాం. అయినా చర్యలు లేవు. కేంద్రం చర్యలు తీసుకునేలా సభలో వెంకటరమణారెడ్డి సలహా ఇవ్వాలి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చెప్పి కాళేశ్వరంపై విచారణ జరిపించలేరా?ఆయనకు చెప్పై ధైర్యం వెంకటరమణారెడ్డికి లేదా?’’అని సీఎం ప్రశ్నించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -