- Advertisement -
• మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ – పెద్దవంగర
కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అవుతాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు చిలుకమారి సత్తయ్య (79) వృద్ధాప్యం తో మృతి చెందారు. సోమవారం మృతుడి భౌతికకాయానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యకర్తలే పట్టుకొమ్మలని, ఆపలో వారికి అండగా ఉంటానని పేర్కొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ, గ్రామ పార్టీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, సంజయ్ కుమార్, సుధాకర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



