జైల్ భరో విజయవంతం
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గునిగంటి రాజన్న
నవతెలంగాణ-నెల్లికుదురు
కార్మిక వర్గం పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని వెంటనే విడనాడాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గునగంటి రాజన్న కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న తెలిపారు. రైతు సంఘం,సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, ఆశ వర్కర్లు, వివో ఏలు, జి ప సిబ్బందితో కలిసి జైలు భరో విజయవంతం చేసే కార్యక్రమం నిర్వహించి మండల కేంద్రంలో బారి ర్యాలీ తీసి అంబేద్కర్ సేంటరులో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం, సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం మహబుబాబాద్ జిల్లా అద్యక్షుడు గునగంటి రాజన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఇసంపేల్లి సైదులు సిఐటియు జిల్లా నాయకులు పెరుమాండ్ల బాబుగౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక కార్మిక,కర్షక,రైతు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా విజయవంతం చేశారని వారు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కొడ్స్ ను రద్దు చేయాల ని రైతు మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని వ్యవసాయ కూలీలు పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని మార్పు వి బి జి రామ్ జి పథకాన్ని తీసుకురావడం జరిగింది, దీనివలన గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిదురిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వాలని చెప్పడం సరైంది కాదని వారన్నారు. దీనివలన ఉపాధి హామీ పని రద్దు చేయాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో కూడా ఉచితలను తీసేవేసే జీవోలు తీసుకురావడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం ఆ జీవోలను కూడా రద్దు చేయాలని అన్నారు .బిజెపి తీసుకొచ్చిన కార్మిక కర్షక రైతు ప్రజా వ్యతిరేక చట్టాలని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికీ పెన్షన్స్.ఇందిరామ్మా ఇండ్లు.ఇంటి పట్టాలు.ఇండ్ల స్థలాలు. రైతులు రైతుల సాగులో ఉన్న వ్యవసాయ భూమికి పట్టాలు ఇవ్వాలని స్కీం వర్కర్స్ కు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఆశ గ్రామపంచాయతీ కార్మికులు పాఠశాలల శానిటేషన్ వర్కర్స్ ఐకెపి వివో ఏలు వ్యవసాయ కార్మికులు రైతులు వివిధ రంగాల కార్మికులు వీరలక్ష్మి బొల్లం ఎల్లయ్య వెంకటమ్మ విజయ వెంకన్న ఆదిలక్ష్మి కౌసల్య హనుమంతు ఐలమ్మ ముత్తయ్య బాణాల యాకయ్య తోట నరసయ్య బత్యం సత్యనారాయణ భూక్య బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.



