Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట : మండల కేంద్రంలో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, వల్లభనేని శ్రీనివాస్ సహకారంతో,, మండల పార్టీ అధ్యక్షుడు, జంపాల సత్యనారాయణ ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ, 44 వ, ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, శ్రీ నందమూరి తారకరామారావు  చిత్రపటానికి, మండల పార్టీ అధ్యక్షులు జంపాల సత్యనారాయణ పూలమాల వేయగా, మండల పార్టీ సీనియర్ నాయకుడు, వల్లభనేని శ్రీనివాసరావు  కొబ్బరికాయ కొట్టి పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టారు, అనంతరం స్వీట్లు పంచి పెట్టారు, ఈ కార్యక్రమంలో, పార్టీ నాయకులు, మల్లికార్జున రావు, మేక వెంకటేశ్వరరావు, స్వామి, బొబ్బ కోటయ్య, సదానందం, మల్లయ్య, బాపేశ్వరరావు, సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -