అధికార కాంక్షతోనే వేధింపుల ఆరోపణలు
హైదరాబాద్ : తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పృథ్వీశ్వర్ రెడ్డిపై మాజీ ఆఫీస్‌బేరర్లు కుట్ర పూరిత పన్నాగం పన్నుతున్నారని ఆ సంఘం మాజీ కోశాధికారి ప్రేమ్ ఆరోపించారు. స్వతహాగా ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడైనా పృథ్వీశ్వర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శిగా బాస్కెట్‌బాల్ లీగ్‌లు నిర్వహించిన ఆటను పురోగతి బాట పట్టించాడని ప్రేమ్ కితాబిచ్చారు. ‘మాజీ కార్యదర్శి నార్మన్ ఐజాక్, అతడి కొడుకు అభిషేక్ 2016-19లో రూ.1.60 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. వీరిపై సీబీఐ, ఫోర్జరీ సహా ఏడు కేసులు ఉన్నాయి. అవినీతి మరకలు లేకుండా బాస్కెట్‌బాల్ అభివృద్దికి కృషి చేస్తున్న పృథ్వీశ్వర్ రెడ్డిపై వేధింపుల ఆరోపణలు చేయటంలో కుట్ర దాగి ఉంది. ఈ విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. తప్పు చేస్తే పృథ్వీశ్వర్‌ను, లేదంటే కుట్రదారులను కఠినంగా శిక్షించాలని’ ప్రేమ్ డిమాండ్ చేశారు.
బాస్కెట్‌బాల్ కార్యదర్శిపై కుట్ర!
- Advertisement -
- Advertisement -



