Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పనిచేస్తున్న కార్మికుడిపైకి దూసుకెళ్లిన కారు

పనిచేస్తున్న కార్మికుడిపైకి దూసుకెళ్లిన కారు

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి : వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బుర్రవాగు స్టేజీ సమీపంలో జాతీయ రహదారి-44పై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి వంతెన పనులు చేస్తున్న కార్మికుడిని కారు ఢీకొట్టడంతో అదుపుతప్పి వంతెన మధ్యలోనే బోల్తా పడింది. ఈ ఘటనలో బీహార్‌కు చెందిన కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -