Monday, March 30, 2026
E-PAPER
Homeకరీంనగర్ఆలయ రహదారి వివాదం.. ప్రజావాణిలో ఫిర్యాదు 

ఆలయ రహదారి వివాదం.. ప్రజావాణిలో ఫిర్యాదు 

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
మండలంలోని మహితాపూర్ గ్రామంలోని గన్నెగుట్టపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయ రహదారి సమస్యపై స్థానిక నాయకులు జగిత్యాలలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. గతంలో మంజూరైన రూ.15 లక్షలతో సిమెంట్ రహదారి పనులు ప్రారంభమైనప్పటికీ, కొంతమంది భూ పట్టాదారులు అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. అధికారులు నక్షా ప్రకారం హద్దులు చూపించి రహదారి సమస్యను పరిష్కరించాలని, లేకపోతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అనుమల్ల రమ, బూస గంగ మల్లయ్య, భూపల్లి పరమేశ్వర్, తొగిటి నవీన్ కుమార్, నాయకులు అనుమల్ల సత్యనారాయణ, మ్యాదరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -