Wednesday, August 12, 2026
E-PAPER
Homeజాతీయంపార్లమెంట్‌ను, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించారు

పార్లమెంట్‌ను, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించారు

- Advertisement -

నిర్మ‌లా సీతారామ‌న్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం
సభలో నేను లేవనెత్తిన అంశాల నుంచి మంత్రి పారిపోయారు ‌: సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్ కౌంట‌ర్‌

నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దేశపూర్వకంగా పార్లమెంటును, ప్రజలను తప్పుదోవ పట్టించారని సీపీఐ(ఎం) రాజ్య‌స‌భ ప‌క్ష‌నేత జాన్ బ్రిట్టాస్ విమ‌ర్శించారు. బ్రిటీష్ వారికి ఎన్నో క్షమాపణలు లేఖలు రాసిన విడి సావర్కర్ అనుచరురాలు నిర్మలా సీతారామన్ కమ్యూనిస్టులను పిరికివాళ్లని అనడం హాస్యాస్పదంగా ఉంద‌ని అన్నారు. మంగ‌ళ‌వారం పార్ల‌మెంట్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ‘‘సావర్కర్ 10వ క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేశారా లేదా 11వ క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేశారా అనేది మాత్రమే వివాదం. బీబీసీ నివేదిక ప్రకారం 11 క్షమాపణ దరఖాస్తులు సమర్పించబడ్డాయి. అయితే 10 క్షమాభిక్ష దరఖాస్తులు వచ్చాయని సావర్కర్ సమీప బంధువు కోర్టుకు తెలిపారు. కమ్యూనిస్టుల ధైర్యాన్ని పరీక్షించేందుకు సావర్కర్ అనుచరురాలు నిర్మలా సీతారామన్ వచ్చారు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ ఉరి కి కూడా వెనుక‌డుగు వేయ‌క‌పోవ‌డం కమ్యూనిస్టుల సంప్ర‌దాయం. అయితే, సావర్కర్, ఆయ‌న‌ సహచరులది క్షమించాలని అడగడంతో బ్రిటిష్ వారి బూట్లను నొక్కే సంప్రదాయం. ప్ర‌తిపక్షాలకు భయపడి ఒక్కరోజు కూడా సభకు రాని ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు నిర్మలా సీతారామన్ కూడా మద్దతుదారు’’ అని జాన్ బ్రిట్టాస్ విమ‌ర్శించారు.

సోమ‌వారం సభలో తాను లేవనెత్తిన అంశాలన్నింటి నుంచి నిర్మలా సీతారామన్ పారిపోయారని ఆయన అన్నారు. ‘‘అత్యంత రహస్యంగా ఆర్డినెన్స్ తెచ్చే నెపంతో తీసుకొచ్చిన ‘టాక్సేషన్ అండ్ అదర్ లా అమెండ్మెంట్ ‘ ద్వారా 55 కోట్ల మందిని ప్రభావితం చేసిన యూపీఐలో సర్వీస్ చార్జీలను రద్దు చేసేందుకు ఆర్థిక మంత్రి పార్లమెంట్ నుంచి బ్లాంక్ చెక్ కొన్నారు. వారు ముందుకు తెచ్చిన ఏకైక కారణం ఏమిటంటే… వారు ఇప్పుడు సర్వీస్ రేటును పెంచడం లేదు. మర్చంట్ డిస్కౌంట్ రేటు కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుందని వారు పేర్కొన్నారు. వినియోగదారులపై భారం మోపకుండా ప్రపంచంలో ఎక్కడైనా వ్యాపారులపై భారం మోపిన చరిత్ర ఉందా?’’ అనే ప్రశ్నకు ఆర్థికమంత్రి స్పందించలేదు. ‘‘వ్యాపారులపై మోపిన భారం వారిపైనే పడుతుందన్న వాదనకు ప్రాతిపదిక ఏమిటి?. యూపీఐకు పూర్తి విముక్తి కల్పిస్తామని ప్రధాని, ఇతరులు గతంలో హామీ ఇచ్చారు. కొత్త సవరణ దానిని పూర్తిగా ఉల్లంఘించడమే. నిర్మలా సీతారామన్ ఉద్దేశపూర్వకంగా పార్లమెంటును, ప్రజలను తప్పుదోవ పట్టించారు’’ అని జాన్ బ్రిట్టాస్ విమర్శలు గుప్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -