– రమణ సన్మాన సభలో ఏఐటీయూసీ నాయకులు
నవతెలంగాణ – సత్తుపల్లి
జేవిఆర్-ఓసీలో ఈపీ ఆపరేటర్‌గా 36 ఏళ్ల సుదీర్ఘ సేవలు పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందిన కేవీ రమణను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ..సత్తుపల్లి జేవీఆర్-ఓసీలో ఈపీ ఆపరేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేవీ రమణ తన 36 సంవత్సరాల సుదీర్ఘ సేవా కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందారని కొనియాడారు. అధికారులు, తోటి కార్మికుల మన్ననలు పొందారని వారన్నారు. క్రమశిక్షణతో, అంకితభావంతో విధులు నిర్వర్తించి పై అధికారులు సూపర్వైజర్ల నుంచి మన్ననలు పొందారని ప్రశంసించారు. తోటి కార్మికులతో ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, క్రమశిక్షణతో పని చేస్తూ యువ కార్మికులకు మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు దారా భీమయ్య, సూర్యప్రకాశరావు, జీ నరసింహారావు, బీ సుధాకర్, భాస్కర్ లాల్, మోతీలాల్, నరేందర్, అశోక్, శ్రీకాంత్, శ్రీను, అఫ్జల్, రాంబాబు, ప్రేమ్ కుమార్, తిరుపతి, సాహిద్ పాల్గొన్నారు.



