Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండో విడతలో 68 గ్రామ సమైక్య భవనాలు మంజూరు

రెండో విడతలో 68 గ్రామ సమైక్య భవనాలు మంజూరు

- Advertisement -

ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు

గ్రామ సమైక్య సంఘాలకు పక్కా భవనాలు మంజూరైనట్లుగా ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూపాలపల్లి జిల్లాలో రెండవ విడతగా మొత్తం 68 పక్కా భవనాలు మంజూరైనట్లు తెలిపారు. ఒక్కొక్క భవనానికి రూ.10 లక్షల నిధులు మంజూరవుతాయని తెలిపారు. భవనాలు మంజూరు చేసిన మంత్రులు సితక్క, శ్రీదర్ బాబు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భూపాలపల్లిలో 7, చిట్యాలలో 6, గణపూర్ లో 3, మొగుళ్ళపల్లిలో 10, రేగొండలో 13, టేకుమట్లలో 3, కాటారంలో 8, మహముత్తరంలో 8, పలిమేలలో 5, మల్హర్ మండలంలో తాడిచెర్ల, మల్లారం, రుద్రారం, దుబ్బపేట, మల్లంపల్లి గ్రామాల్లో మంజూరైనట్లుగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -