సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వేస్లీ
నవతెలంగాణ-వనపర్తి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవలంబిస్తున్న విధానాలను దేశ ప్రజలు తిప్పికొడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్యవక్తగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వేస్లీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా సామ్రాజవాదం పాలస్తీనాపై యుద్ధం కొనసాగిస్తూ క్యూబా దేశం మీద ఆర్థిక ఆంక్షలు విదిస్తుందన్నారు. చైనా వస్తువులను అమెరికా దిగుమతి చేసుకుంటే వంద శాతం సుంకాలు విధిస్తామని బెదిరింపులు చేసిందన్నారు.
కానీ చైనా వినకపోవడంతో ఏమి చేయలేకపోతుందన్నారు. మోడీ, అమిత్ షా అనుకుంటే ఎదురు లేదని ప్రచారం జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున దేశ యువత మోడీ విధానాలకు వ్యతిరేకంగా సీజేపీ రూపములో పోరాటం నిర్వహించిన సందర్భాన్ని చూస్తున్నామన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుందామని, యువత, మహిళలు పోరాటం చేస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు పోరాటం కొనసాగడం మార్పుకు నిదర్శనం అన్నారు. ఈ దేశ యువత విజయం సాధించారని అన్నారు.
దీంతో బీజేపీ విధానాన్ని వ్యతిరేకించే పరిస్థితి ప్రజల్లో వచ్చిందన్నారు. పోరాటంలో పాల్గొన్న యువతను దేశ ద్రోహులు అని ప్రకటించిన ప్రభుత్వానికిి, వాళ్లు దేశ ద్రోహులు కారని చివరికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటించావాల్సి వచ్చిందన్నారు. మళ్ళీ డీలిమిటేషన్, మహిళా బిల్లు పార్లమెంట్లో తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందన్నారు. ఆ బిల్లులను సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్తలంతా ఒక్కటిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా దేశ సంపదను అంబానీ, ఆదానీలకు కట్టబెడుతుందని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని దోచి బడా పెట్టుబడి దారులకు పెడుతోందని ఆరోపించారు. దేశంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం లేదన్నారు. బొగ్గు గనులను బ్యాంకులను రైల్వేలను ఎల్ఐసి రక్షణ రంగం మొదలగు వాటిని తమ తాబేదారులకు కట్టబెట్టడమే దేశభక్తినా అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. నేటికీ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణముగా రైతులకు రైతు బందు వేయలేదని, వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఖరీపు సీజన్ లో హాలిడే ప్రకటించిన రైతులకు న్యాయం చేయలేదన్నారు. రోజు రోజుకు కాంగ్రేస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత వస్తుందన్నారు. రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షన పోరాటం ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. డి. జబ్బార్, డి. బాల్ రెడ్డి, మండ్ల రాజు, లక్ష్మి, గోపి, జిల్లా కమిటీ సభ్యులు పరమేశ్వర చారి, మేకల ఆంజనేయులు, ఆర్ఎన్. రమేష్, మండ్ల కృష్ణయ్య, ఎస్. రాజు, బి.వెంకటేష్, బాల్య నాయక్, మహబూబ్ పాషా, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.



