అన్ష్, వాసవి గణేషన్ జంటగా రూపొందిన చిత్రం ‘హుషార్ పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ సినిమాని ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఈనెల 15న విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ,‘ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ అందరికీ నచ్చింది. ఆల్రెడీ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ టైంలో నాకు సురేష్ బాబు, శిరీష్, బెక్కెం వేణు గోపాల్ సహాయం చేస్తున్నారు. మేమంతా కష్టపడి సినిమాని తీశాం. మేం ఒంటరిగా పోరాడుతున్నాం. మా ఈ పోరాటంలో మీడియా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తెలుగు వాళ్లందరం కలిసి చేసిన సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చెప్పిన కథను భిక్షు తెరపైకి అద్భుతంగా తీసుకువచ్చారు. రుద్ర సాయి విజువల్స్ గురించి అందరూ మాట్లా డుతున్నారు. చరణ్ అర్జున్ ఈ సినిమాకి ఓ పిల్లర్. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ఫైనాన్షియర్ శివకు థాంక్స్. సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేయండి’ అని అన్నారు. అన్ష్ మాట్లాడుతూ,‘ఈ సినిమాతో హిట్టు కొట్టబోతోన్నా అని నమ్మకంగా చెబుతున్నా. చిన్న ప్పటి నుంచి స్టేజ్ మీద నాటకాలు వేస్తుండేవాడిని. కృష్ణా నగర్‌లో ఓ ఆడిషన్‌కి వెళ్తే.. అక్కడ కాఫీ కప్పులు తీయించారు. కానీ నా అభిమాన హీరో చిరంజీవిని స్పూర్తిగా తీసుకున్నాను. ఈ సినిమాకి చరణ్, చిరంజన్, సింగర్స్, డీఓపీ సాయి ప్రాణం పోశారు’ అని తెలిపారు.
వైవిధ్యమైన కథ, కథనాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



