Friday, August 14, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తాం: ప్రిన్సిపాల్

విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తాం: ప్రిన్సిపాల్

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలను అందించేందుకు కృషి చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగ్స్, షూ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించి, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా అధ్యాపక బృందం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలో చేర్పించాలని కోరారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలా మేము తయారు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -