నవతెలంగాణ-నవాబు పేట
నవాబు పేట మండల పరిధిలోని తీగలపల్లి గ్రామంలోని శ్రీ కనకదుర్గ పారా బాయిల్డ్ రైస్ మిల్లు యజమాని ధర్మారం కొట్టం సాయిబాబా రెడ్డిపై కేసు నమోదైందనీ ఎస్ఐ నరెందర్ తెలిపారు. ఈనెల 06న సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. పై కనకదుర్గ రైస్ మిల్లులో సుమారు 49,149 (1965 మెట్రిక్ టన్నులు) వరి ధాన్యం బ్యాగులు తక్కువగా నమోదయ్యాయని, పై కొరత విలువ సుమారు రూ. 7 కోట్ల 12 లక్షల 65 వేలు ఉంటుందని సివల్ సప్లై అధికారులు అంచనా వేశారు. పై కారణంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పై కనకదుర్గ రైస్ మిల్ యజమానిపై ధర్మారం కొట్టం సాయిబాబా రెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్ఐ నరెందర్ తెలిపారు.
కనకదుర్గ రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


