Friday, August 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో శుక్రవారం జాతీయ జెండాలతో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ తడిసిన మల్లారెడ్డి, బిజెపి మండల పట్టణ పార్టీ అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, నంద గంగేష్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు అధికారులు మాత్రమే జాతీయ జెండాను ఆవిష్కరించేవారని, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. అదేవిధంగా 100 మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ఆలేరు ప్రభుత్వ పాఠశాల మైదానం నుండి దుర్గమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలేరు పట్టణంలోని అన్ని పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -