నవతెలంగాణ – నెల్లికుదురు
అభివృద్ధి ప్రదాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కి శాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపినట్లు మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ జిల్లా నాయకుడు నాయని సత్యపాల్ రెడ్డి మండల నాయకులు గుదే యుగంధర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి భూకే అందించి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలేరు నుండి తారసింగ్ బావి వరకు 18 కోట్ల BT(HAM ప్రాజెక్ట్) రోడ్డును మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు. అలేరు నుండి కల్వల వరకు డబల్ రోడ్డును మరియు అలేరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో క్లాస్ రూమ్స్ కొరకు నూతన భవనాన్ని కోరడం జరిగింది. దీనికి వేం నరేందర్ సానుకూలంగా స్పందించడం పట్ల హర్ష వ్యక్తం ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు యుగేందర్ గౌడ్ చారి తదితరులు పాల్గొన్నారు.



