నవతెలంగాణ – చండూరు
చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన మంచికంటి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మంచికంటి లక్ష్మయ్య 78వ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ ఎం సి ఏ ల్ మంచికంటి వెంకటరమణ ఆధ్వర్యంలో గ్రామంలోని మంచికంటి గోపమ్మ స్మారక ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మంచికంటి వెంకటరమణ మాట్లాడుతూ..డా. లక్ష్మయ్య చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని చదువుకుంటూ అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడ్డారని తెలిపారు. తన మాతృభూమికి సేవ చేయాలనే తపనతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, స్వగ్రామంతో పాటు పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారని కొనియాడారు. విద్యార్థులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్మయ్య కి ఇచ్చే నిజమైన జన్మదిన కానుక అని ఆయన అన్నారు.అనంతరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు రూ.20 వేల రూపాయల నగదు బహుమతులు* మంచికంటి వెంకటరమణ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంచికంటి గోపమ్మ స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఊట్కూరి సుధాకర్ రెడ్డి, పెండ్యం గంగాధర్ ,మంచికంటి విద్యాలయాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


