Saturday, August 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅందమైన ప్రేమకథ

అందమైన ప్రేమకథ

- Advertisement -

తెలుగు తెరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందిం చిన దర్శక, నిర్మాత పి.ఎన్. రామచంద్రరావు కొంత విరామం తర్వాత రూపొందించిన పాన్ ఇండియా సినిమా ‘పహల్గాం లవ్ స్టోరీ’.
గాయత్రి కళా చిత్ర బ్యానర్ పై పి.ఎన్. రామచంద్రరావు నిర్మించి, దర్శకత్వం వహించారు. ఇంటెన్స్ పేట్రియాటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణ మోహన్, చిత్రశుక్ల హీరో హీరోయిన్స్ గా నటించారు. సుమన్, పూజా బిస్త్, జయప్రకాష్ నారాయణ ఇతర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద ఆసక్తి పెంచుతోంది. మనసుకు హత్తుకునే రొమాంటిక్ లవ్ స్టోరీని చూపిస్తూనే దేశభక్తి, జాతీయ సమైక్యత వంటి అంశాలను మేళవించి ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్స్ లో ఎక్సిపీరియన్స్ చేయబోతున్నారు. “పహల్గాం లవ్ స్టోరీ” కేవలం వినోదం కోసం రూపొందించిన సినిమా మాత్రమే కాదు, మనందరిలో దేశభక్తిని మేల్కొలిపే ఒక జాతీయ సమస్యను ఈ సినిమాలో చూపిస్తున్నాం అని చెబుతున్నారు దర్శక నిర్మాత పి.ఎన్. రామచంద్రరావు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -