Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యాభివృద్ధికి ఇనానీ చేసిన సేవలు మరువలేనివి

విద్యాభివృద్ధికి ఇనానీ చేసిన సేవలు మరువలేనివి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలో విద్యాభివృద్ధికి ప్రముఖ వ్యాపారవేత్త ఇనాని సేట్ రాంప్రసాద్ చేసిన సేవలు మరువలేనివని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. శనివారం కళాశాల ఆవరణలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఇనానీ కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ..ఇనానీ కుటుంబం ప్రభుత్వ కళాశాలకు రెండెకరాల స్థలాన్ని, బాలుర రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలకు ఐదెకరాల స్థలాలను విరాళంగా అందించిన ఆదర్శవంతమైన, గొప్ప కుటుంబమని కొనియాడారు. తాజాగా స్వతంత్య దినోత్సవం సందర్భంగా టెన్త్, ఇంటర్ పరీక్షలలో టాపర్ లుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులిచ్చి ప్రోత్సహించారని చెప్పారు. మొదటి బహుమతి రూ.5 వేలు, రెండవ బహుమతి రూ. 3 వేలు, మూడవ బహుమతి రూ. 2వేలు, గణితం టాప్ మార్కులు సాధించిన విద్యార్థికి రూ. 2 వేల చొప్పును మొత్తంగా రూ.36,000- అందజేసి, విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారని అన్నారు. కార్యక్రమంలో ఇనానీ కుటుంబ సభ్యులు, హైస్కూల్, కళాశాల సిబ్బందితో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -