Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాల అభివృద్ధిపై చల్లా ధర్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

పరకాల అభివృద్ధిపై చల్లా ధర్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

- Advertisement -

బీఆర్‌ఎస్‌ హయాంలో అభివృద్ధి.. కాంగ్రెస్‌ హయాంలో రంగులు, ప్రారంభోత్సవాలే!
నవతెలంగాణ–పరకాల

బీఆర్‌ఎస్‌ హయాంలో కేసీఆర్‌ సహకారంతో పరకాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మంజూరు చేసి పూర్తి చేసిన వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కళాశాలలకు రంగులు వేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం తామే అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటోందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ పాలనలో పరకాల పట్టణానికి కొత్తగా చేసిన అభివృద్ధి ఏమిటో ఎమ్మెల్యే ప్రజలకు చూపించాలని సవాల్‌ విసిరారు.పూర్తయిన వంద పడకల ఆస్పత్రిని ఇంతకాలం ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారో ఎమ్మెల్యే ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. ఇప్పటికీ ఆస్పత్రికి అవసరమైన పరికరాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని, సిబ్బంది నియామకాలు కూడా జరగలేదని ఆరోపించారు. సిబ్బంది నియామకాలను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్‌ చేశారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు రంగులు వేసుకోవడం కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా చేపట్టి పూర్తి చేసిన ఒక్క అభివృద్ధి పనినైనా ప్రజలకు చూపించాలని చల్లా ధర్మారెడ్డి సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -