Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేడిపల్లిలో తాగునీటి కష్టాలు

మేడిపల్లిలో తాగునీటి కష్టాలు

- Advertisement -

వార్డు సభ్యుడుకే తాగునీరు అందని పరిస్థితి
నవతెలంగాణ – మల్హర్ రావు

కాటారం మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీ 1వ వార్డులో గత మూడు నాలుగు రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడిందని, వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించాలని 1వ వార్డు సభ్యుడు గుంటి లక్ష్మన్ డిమాండ్ చేశారు. తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా అప్పాల భూమేష్ యాదవ్ తోపాటు పలువురు మాట్లాడారు. వార్డు మెంబర్‌కే తాగునీటి కోసం ఇబ్బందులు ఎదురైతే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. గ్రామ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనేస్ స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -