Saturday, August 15, 2026
E-PAPER
Homeజిల్లాలుమిడ్జిల్ ఆస్పత్రికి రెండు ఉత్తమ అవార్డులు..

మిడ్జిల్ ఆస్పత్రికి రెండు ఉత్తమ అవార్డులు..

- Advertisement -

మంత్రి జూపల్లి చేతుల మీదుగా అవార్డు అందుకున్న వైద్య సిబ్బంది 
నవతెలంగాణ-మిడ్జిల్ 

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రోగ్రాం అధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శివకాంత్ కు, మండలంలోని వస్పూల సబ్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం పారిజాతకు ప్రజా ఆరోగ్య రక్షణలో నిరంతరం శ్రమిస్తూ, విశేష సేవలందించిన వైద్యులకు, ఆరోగ్య సిబ్బందికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  జూపల్లి కృష్ణారావు చేతుల మీదిగా ఈ ఉత్తమ అవార్డులను అందజేశారు. 

వైద్య సేవల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు గాను సదరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) రెండు ఉత్తమ బహుమతులు లభించాయి. ఉత్తమ ప్రోగ్రాం అధికారిగా వివిధ ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లినందుకు గాను డాక్టర్ శివకాంత్ ఉత్తమ ప్రోగ్రాం అధికారిగా అవార్డును అందుకున్నారు. ఉత్తమ ఏ ఎన్ ఎం  వస్పుల్  సబ్ సెంటర్ పరిధిలో గర్భిణులు, బాలింతలు,గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా సేవలందించిన ఏఎన్ఎం పారిజాతకు ఉత్తమ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో ఆరోగ్య సిబ్బంది పాత్ర కీలకమని కొనియాడారు. అవార్డు గ్రహీతలు మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అవార్డులు అందుకున్న వైద్య బృందానికి, సిబ్బందికి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

హర్షం వ్యక్తం 
మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిధులు నిర్వహిస్తున్న డాక్టర్ శివకాంత్ కు, ఏఎన్ఎం పారిజాతకు ఉత్తమ అవార్డు రావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న  వైద్య సిబ్బంది సంపత్ కుమార్, దేవయ్య, జంగయ్య ఒక ప్రకటనలో వర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -