Saturday, August 15, 2026
E-PAPER
Homeఖమ్మంసీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు

- Advertisement -

– జాతీయ పతాకాన్ని ఎగురవేసిన పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట

స్వాతంత్ర్య దినోత్సవ 80వ వార్షికోత్సవ వేడుకలను సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ.. అనేక మంది త్యాగధనుల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని అన్నారు. అయితే మతోన్మాద శక్తులు సమాజాన్ని మత ప్రాతిపదికన విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య ఐక్యతను కాపాడుతూ, లౌకిక ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలు తగరం నిర్మల, జిల్లా నాయకులు బుడితి చిరంజీవి, మండల కార్యదర్శివర్గ సభ్యులు ముల్లగిరి గంగరాజు, మడిపల్లి వెంకటేశ్వరరావు, ఏసు, హమాలీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -