Saturday, August 15, 2026
E-PAPER
Homeఖమ్మంమున్సిపాలిటీ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు

- Advertisement -

– జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్‌పర్సన్‌ జూపల్లి శశికళ
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ కార్యాలయం వద్ద చైర్‌పర్సన్‌ జూపల్లి శశికళ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాజరై మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ జూపల్లి రమేష్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -