Saturday, August 15, 2026
E-PAPER
Homeఖమ్మంఅభివృద్ధిలో అశ్వారావుపేటను అగ్రగామిగా నిలుపుదాం: ఎమ్మెల్యే జారె

అభివృద్ధిలో అశ్వారావుపేటను అగ్రగామిగా నిలుపుదాం: ఎమ్మెల్యే జారె

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట 
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు, సర్వాంగీణ అభివృద్ధికి కృషి చేస్తూ అశ్వారావుపేటను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుదామని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు.  శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉచిత కుట్టు మిషన్లు, దివ్యాంగుల రవాణా సౌకర్యార్థం ఎలక్ట్రికల్ త్రిచక్ర వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో అశ్వారావుపేటను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ మండలాల అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -