Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం 

మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం 

- Advertisement -

ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ 
ఎంపీ పోరిక బలరాం నాయక్ 
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు 

మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రారంభించినట్లు మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్, మాజీ జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి తెలిపారు. శనివారం స్వాతంత్ర దినోత్సవ జెండాను ఆవిష్కరించిన అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి సమావేశాన్ని నిర్వహించారు. మొదటగా నూతన మండల అధ్యక్షుడుకి శాలువాతో ఘనంగా సత్కరించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే శ్రీరామరక్ష అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.

అయినప్పటికీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. మండలంలో ఓటుకు అర్హులైన వారందరూ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. పార్టీ అభివృద్ధి కోసం గ్రామాలలో కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, వారి ఆధారంగానే ఈరోజు ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేస్తోందన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయని, పదవి రావడం గొప్ప కాదని, సేవ చేసే గుణం ఉండాలని అన్నారు.

గ్రామాల్లో ప్రతి ఒక్కరిని కలుపుకొని వాటి అభివృద్ధి కోసం ముందడుగు వేయాలని అన్నారు. మండలాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, రాష్ట్ర జిల్లా మండల్ నాయకులు మాజీ, జెడ్పిటిసిహెచ్ వెంకటేశ్వర్లు, మాజీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, నాయిని సత్యపాల్ రెడ్డి, వలబోజు వెంకటేశ్వర్లు, ఆకుతోట సతీష్, బాలాజీ నాయక్, మద్ది రాజేష్, పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్, కాసం రంజిత్ రెడ్డి, పట్నం శెట్టి నాగరాజు, గుదే యుగేందర్, నాయిని శ్రీపాల్ రెడ్డి, క్రాంతి రెడ్డి వారి పల్లి పూర్ణ ఇతరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -