నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జాతీయ జెండా ఎగరవేశారు. అదేవిధంగా మార్కెట్ కార్యాలయం వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి జెండావిష్కరణ చేశారు. వీటితో పాటు కోర్టు, ప్రజా సంఘాలు, కుల సంఘాల, పోలీస్ స్టేషన్, మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఎస్టిఓ కార్యాలయం, కళాశాలలో, విద్యుత్ కార్యాలయం, పిఎసిఎస్ కార్యాలయం, ఎంఈఓ కార్యాలయం, కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీ కార్యాలయాల వద్ద, మార్కెట్ కార్యాలయం వద్ద, చేనేత సహకార సంఘం, పద్మశాలి సంఘం, డ్రైవర్ యూనియన్ అసోసియేషన్, బ్యాంకుల వద్ద, యువజన సంఘాల కార్యాలయాలు, గ్రంథాలయం, అగ్నిమాపక కేంద్రం కార్యాలయం, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లు, పాల సంఘాల చైర్మన్లు, కుల సంఘాలు జాతీయ జెండాను ఎగరవేశాయి.
ఈ సందర్భంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఉద్యమ వీరుల గత స్మృతులను, దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మెజిస్ట్రేట్ అజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ బీజన బాలమణి, పద్మశ్రీ చింతకింది మల్లేశం, చేనేత సహకార సంఘం చైర్మన్, దాసి శంకర్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎం వినయ్ కుమార్ , ఉదయ్ కిరణ్, ఎంఈఓ ఎర్ర లక్ష్మి, పీఎం శ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దాసరి మంజుల, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దాశరధి రమాదేవి, శ్రీకృష్ణ పాల సంఘం చైర్మన్ పంతం కృష్ణ, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు యేలుగల అంజయ్య, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పుర ప్రముఖులు పాల్గొన్నారు.



