Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత

ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు రవికుమార్, దశరథ్ లను ప్రభుత్వం ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విహెచ్. హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, చేతుల మీదుగా ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. రవికుమార్ ఎస్ఐఆర్ – ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గాన్ని జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిపారు. అదేవిధంగా దశరథ్  భూభారతి పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన ఫైళ్లను పెండింగ్ లేకుండా సకాలంలో పూర్తి చేసి, ప్రజలకు తక్షణ సేవలు అందించారు. వారి కృషిని, నిబద్ధతను అభినందిస్తూ ఈ ప్రశంస పత్రాలను అందజేసినట్లు అధికారులు తెలిపారు. ప్రశంస పత్రాలు అందుకున్న అనంతరం ఇరువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ప్రజా సేవ చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డిఓ, తహసీల్దార్, కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -