సీఎం, స్పీకర్, మంత్రులు, చీఫ్‌జస్టిస్‌కు గవర్నర్ దంపతుల ఆతిథ్యం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా శనివారం లోక్‌భవన్‌లోని గార్డెన్స్‌లో ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, మంత్రులు నలమంద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు సహా ఎంపీలు ఈటల రాజేందర్, వేం నరేందర్‌రెడ్డి ధర్మపురి అర్వింద్ కుమార్ గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్నారు. కానీ ప్రతిపక్ష బిఆర్‌ఎస్ నుంచి ఎవరూ ఎట్ హోం కార్యక్రమానికి హాజరు కాలేదు. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ఎట్‌హోంకు దూరంగా ఉండగా.. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు సైతం లోక్‌భవన్ వేడుకలో పాలుపంచుకోలేదు. సీఏం రేవంత్ రెడ్డి సహా మంత్రులను సాదరంగా ఆహ్వానించిన గవర్నర్ దంపతులు శివప్రతాప్ శుక్లా, జానకి శుక్లా.. తేనేటి ఆతిథ్యం అందించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, డీజీపీ సివి ఆనంద్, హైదరాబాద్ సీపీ సజ్జనార్, పలువురు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, సైనికాధికారులు, హైకోర్టు రిజిస్ట్రార్‌లు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎట్‌హోంకు బీఆర్‌ఎస్ దూరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



