Sunday, August 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువీరులెందరో అమరులయ్యారు

వీరులెందరో అమరులయ్యారు

- Advertisement -

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాన్‌‌వెస్లీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
బ్రీటీష్‌ ‌సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా చేసిన పోరాట ఫలితమే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ అన్నారు. భగత్‌‌సింగ్‌‌తోపాటు వీరులెందరో అమరులయ్యారని 
గుర్తు చేశారు. స్వాతంత్ర్య పోరాట చరిత్రలేని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ దేశాన్ని పాలిస్తూ తిరోగమనంలోకి తీసుకెళుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇది దేశానికి అవమానకరమని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌‌లోని ఆర్టీసీ క్రాస్‌‌రోడ్స్‌‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయపతాకాన్ని జాన్‌‌వెస్లీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదరికంతోపాటు కుల వ్యవస్థ నిర్మూళనకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మహిళలకు పూర్తిస్థాయిలో హక్కులు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోయిందని వివరించారు. దేశప్రజలకు విద్యా,వైద్యం ఇంకా అందకోవడం దారుణమని 
ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలను అక్షరాస్యులను చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని నిరసించారు.

ప్రజాస్వామిక హక్కులను కాపాడలేదని గుర్తు చేశారు. సామ్రాజ్యవాదుల ముందు ప్రజలు మొకరిల్లే పరిస్థితి సృష్టించారని తెలియజేశారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. సీబీఐ, ఈస, ఈడీతోపాటు న్యాయ వ్యవస్థలను బీజేపీ మోడీ సర్కారు నాశనం చేస్తున్నదని చెప్పారు. తెలంగాణలో 73 లక్షల ఓట్లు రద్దయ్యే ప్రమాదమేర్పడిందని వవరించారు. మహిళలకు రక్షణ లేకుండాపోయిందన్నారు.ఉద్యమాలు చేస్తే అణచివేస్తున్నారని చెప్పారు. పార్లమెంటులో ప్రజాసమస్యలపై చర్చించే పరిస్తితి లేదనీ, ప్రధాని, కేంద్ర మంత్రులు సభకు రాకుండా ఎగ్గోడుతున్నారని స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే ఉపా చట్టం కింద అరెస్ట్‌ ‌చేసి జైళ్లల్లో పెడుతున్నారని వివరంచారు.

దేశంలో అలౌకిక పాలన సాగుతున్నదని గుర్తు చేశారు. మతాల మధ్య చిచ్చు పెడుతు మతసామరస్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని తెలిపారు. దేశ ఐక్యతకు ఇది ఆటంకంగా ఉందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడాన్ని సవాల్‌ ‌చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోవడం, భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రశ్నార్థకం చేస్తున్నారని వివరించారు. ఈ కార్య్రకమానికి అధ్యక్షత వహించిన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి, మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్టకార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ ఒక్కటే కాదని అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం, సమానత్వం, లౌకికపాలన అని గుర్తు చేశారు. జెండావిష్కరణలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి నాగయ్య, టి. సాగర్‌, రాష్ట్ర కమిటీ సబ్యులు ఆర్‌.వెంకట్‌‌రాములు, శ్రీరాంనాయక్‌, బాబూరావు, అరుణజ్యోతి, నాయకులు శ్రీనివాస్‌‌రెడ్డి, కోట రమేష్‌, శోభన్‌‌నాయక్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -