- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాల్టీ వార్డు నెంబర్ 6 ఎన్నిక ఏప్రిల్ 18న నిర్వహించనున్నట్ట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపింది. ఈ మేరకు గురువారం ఆమె షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 6న నామినేషన్ దాఖలు, 7న నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ, అనంతరం బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 11 రాష్ట్రంలోని 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే మక్తల్ మున్సిపాల్టీలోని 6వ వార్డు బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప మృతితో ఎన్నికల నిలిచిపోయింది. దాంతో తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది.
- Advertisement -



