నవతెలంగాణ – మల్హర్ రావు
ఎక్షైజ్ శాఖ వరంగల్ అసిస్టెంట్ కమీషనర్ కె.నవీన్ కుమార్ ఆదేశాలతో ప్రోహిబిషన్ ఎక్సజ్ డిప్యూటీ కమీషనర్ దత్తురాజ్ గౌడ్, జిల్లా డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్, అధికారి బి.కిరణ్ ఆధ్వర్యంలో మేరకు కాటారం స్టేషన్ ఎన్ఫోర్స్మెంట్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, సమన్వయంతో మహాముత్తారం మండలంలోని కోర్లకుంట, దొబ్బలపాడు గ్రామాల్లో, మలహార్ రావు మండలంలోని ఎడ్లపల్లి, కొండంపేట గ్రామాల్లో, కాటారం మండలంలోని గంగారాం, చింతకాని గ్రామాల్లో నాటు సారాయి తయారీ స్థావారాలపై దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో 10 మంది పై కేసులు నమోదు చేసి, 9 మంది నిందితులను అరెస్ట్ చేసి, 46 లీటర్ల నాటు సారాయి, 20 కిలోల చక్కర, 2 కిలోల డ్రై ఈస్ట్ తో పాటు 1 ద్విచక్ర వాహనంను స్వాధీన పరుచుకోని, 1250 లీటర్ల చక్కర పానకాన్ని ధ్వంసం చేశారు. నాటుసారాయి వల్ల ప్రజలకు జరుగు నష్టం గురించి అవగాహన నిర్వహించారు. ఎవరైనా నాటు సారాయిని తయారు చేసిన, రవాణా చేసిన, విక్రయించిన చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాటారం ఎస్ఐ బాదావత్ కిష్టయ్య, భూపాలపల్లి ఎస్ఐ రాజ సమ్మయ్య, నాగేశ్వర్ రావు, రబ్బానీ, గణేష్, కృష్ణ నాయక్, శ్రీనాథ్, హుస్సేన్, కుమార్ పాల్గొన్నారు.



