Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేస్తే ఉద్యమం తప్పదు

పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేస్తే ఉద్యమం తప్పదు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేయాలని చూస్తే ఉద్యమం తప్పదని బిజెపి పార్టీ కాటారం మండల అధ్యక్షుడు పాగే రంజిత్ కుమార్ హెచ్చరించారు. కాటారం మండలం  కొత్తపల్లి శివారులో గల పాలిటెక్నిక్ కళాశాల ముందు జిబో 97కు వ్యతిరేకంగా విద్యార్థిని, విద్యార్థులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి బీజేపీ కాటారం మండల శాఖ పక్షాన సంపూర్ణ మద్దతు పలికి, నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 13న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏమర్జెన్సీగా తీసుకోచ్చిన జీవో 97 శక్తి పేరుతో ఐటిఐ పాలిటెక్నిక్, ఏటీసీ లను మెర్జ్ చేయాలని తీసుకు వచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవోపై విద్యార్థులు, అధ్యాపాకుల అభిప్రాయాలూ పరిగణలోకి తీసుకోవాలన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు జివో పైన ఉన్న సందేహాలు తీర్చాలన్నారు. పాలిటెక్నిక్ ని ఏఐసిటిఈ పరిధిలోనే కొనసాగించి, వారికి ఈసెట్ ద్వారా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశలు కల్పించాలన్నారు.శక్తి పేరుతో  విద్యార్థులకు అన్యాయం చేయాలని చుస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -