నవతెలంగాణ – పరకాల
గౌడ సంక్షేమానికి రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, గీత కార్మికుల పెన్షన్ను రూ.4 వేలకు పెంచాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ డిమాండ్ చేశారు. గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర సోమవారం పరకాలకు చేరుకుంది. పరకాల నియోజకవర్గ నాయకులు ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ అధ్యక్షతన సాయిబాబా గుడి నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా బస్సు డిపో వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద సమావేశం జరిగింది.ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ వృత్తిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు.
కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రజినీకాంత్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బండి సదానందం గౌడ్, మార్కా రఘుపతి గౌడ్, బుర్ర రాజమౌళి గౌడ్, గునిగంటి రవి గౌడ్, బుర్ర రామ్మూర్తి గౌడ్, నడికూడా మండల అధ్యక్షుడు పోషాల అశోక్ గౌడ్, పరకాల మండల ప్రధాన కార్యదర్శి గునిగంటి బిక్షపతి, ఉపాధ్యక్షులు రాపర్తి శ్రీధర్, ఆముదాలపెల్లి తిరుపతి, వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు, గీత కార్మికులు పాల్గొన్నారు.



