Wednesday, August 19, 2026
E-PAPER
Homeసినిమా‘అమీర్‌ లోగ్‌’ ఎవరు?

‘అమీర్‌ లోగ్‌’ ఎవరు?

- Advertisement -


అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకుడు. ఎం.సి.హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ మూవీని తెలుగులో ఈనెల 21న రిలీజ్ చేయనుంది.
ఈ నేపథ్యంలో సోమవారం దర్శకుడు రమణా రెడ్డి సోమ మీడియాతో ముచ్చటించారు.
మూడేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ తీశాను. అవుట్ పుట్ చూసి.. ఇలా కాదు.. ఇంకాస్త బాగా తీయాలని అనుకున్నాను. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాకే సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాను. పాడ్ కాస్ట్‌లో ఓ సారి మనోజ్ బాజ్‌పేయి మాట్లాడుతూ ‘అమీర్ లోగ్’ అని అన్నారు. అక్కడి నుంచి ఈ ప్రయాణం ప్రారంభమైంది.
‘అమీర్ లోగ్’ అనే టైటిల్‌ను ముందు ఫిక్స్ అయ్యాను. అక్కడి నుంచి అసలైన అమీర్ లోగ్ ఎవరు? అని రకరకాలుగా రాసుకున్నాను. ఓ బస్తీ, ముగ్గురు కుర్రాళ్లు అని కథను రాయడం ప్రారంభించాను. హైదరాబాద్ బస్తీని తెరపై అద్బుతంగా చూపించాలని అను కున్నాను. ఇలాంటి సినిమాకి అన్నీ సహజం గానే ఉండాలి. సెట్‌లు కూడా వేయలేం. బస్తీలోనే షూట్ చేయాలి. సింక్ సౌండ్‌తోనే ఆ ఎఫెక్ట్ కనిపిస్తుందని నమ్మాను.
స్పిరిట్ టీంకి మా సినిమా బాగా నచ్చింది. మాకు రానా ఇస్తున్న సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఈ మూవీని ఇప్పటికి చాలా మందికి చూపించాను. రీసెంట్‌గానే చాలా మంది డైరెక్టర్లు, యాక్టర్లకు చూపించాను. అందులో వీఎన్ ఆదిత్య మెచ్చుకున్నారు. రైటింగ్ అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు.
ప్రతీ పాత్ర కోణంలోంచి కథ కనిపిస్తుంది. మా చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది అని గర్వంగా చెప్పగలను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -