నవతెలంగాణ-బజార్హత్నూర్
గిరిజన గ్రామాల్లో మారుమూల ప్రాంతాలకు కాలినడకన వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించిన హెచ్ఈఓ సూర్యప్రకాశ్‌ను బజార్హత్నూర్ పీహెచ్సీ సిబ్బంది అభినందించారు. ఆగస్టు 15న ఐటీడీఏ పీవో చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా మంగళవారం పీహెచ్సీలో డాక్టర్ నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్‌రెడ్డి మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు, ఆరోగ్య అవగాహన అందించేందుకు సూర్యప్రకాశ్ చేసిన కృషి అభినందనీయమన్నారు.
మారుమూల గ్రామాలకు సైతం కాలినడకన వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు సేవలందించారని తెలిపారు. పీహెచ్‌సీకి సంబంధించిన ప్రతి నివేదికను నిర్ణీత సమయంలో సక్రమంగా పంపిస్తూ పీహెచ్‌సీకి మంచి గుర్తింపు తీసుకురావడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. సూర్యప్రకాశ్‌కు అవార్డు రావడం పీహెచ్సీ సిబ్బందికి గర్వకారణమని అన్నారు. అనంతరం సిబ్బంది ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ దినేష్, పీహెచ్ఎన్ సుశీల, హెల్త్ అసిస్టెంట్ రమేష్, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.



