పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా, రాష్ట్ర మాజీ రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు మానండి
తాటికొండ శ్రీనివాస చారి, పసర బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
కాంగ్రెస్ పార్టీకి స్థానిక మంత్రికి రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ప్రేమ ఉన్న లక్నవరం నీటిని విడుదల చేసి రైతుల కన్నీళ్లను తుడవాలని బి ఆర్ఎస్ పార్టీ పసర గ్రామ కమిటీ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాసచారి అన్నారు. మంగళవారం మండలంలోని పసర గ్రామంలో శ్రీనివాసచారి కార్యకర్తలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా, రాష్ట్ర మాజీ రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి గారి పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. నిన్న క్రికెట్ టోర్నమెంట్ గురించి సతీష్ రెడ్డి మీద కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేయడానికి వీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జిల్లా ప్రజలకు సతీష్ రెడ్డి చేసిన లాక్ డౌన్ లో నిరుపేద కుటుంబాలకు జిల్లా ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి కానీ కొంతమంది చేసే ఆరోపణలు సరికాదని హెచ్చరిస్తూ. ఎవరైనా మాట్లాడే ముందు వారి స్థాయికి మించి మాట్లాడవద్దన్నారు. అదేవిధంగా కొంతమంది స్థానిక ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ నాయకుల నుండి లబ్దిపొంది డబ్బులు తీసుకుని గెలిచి, విశ్వాసం లేకుండా ఈరోజు కోవార్టర్లుగా మారి పార్టీల మధ్య, నాయకులను విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇకపై ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించం ఖబర్దార్.
రైతుల బాధ చూడడు కానీ , ఒక మినిస్టర్ కొడుకు చేసిన తప్పును బయటపెడితే , ఆ తప్పును, తప్పుదోవ తపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
మీకు అంత బుద్ధి ఉంటే ముందు లక్నవరం నుండి నీళ్ళు విడుదల చేసి రైతుల కన్నీళ్లు తుడవాలన్నారు. మా బీఆర్ఎస్ నాయకుల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, అది దాటితే మళ్ళీ మరో తెలంగాణ ఉంద్యమం ఇక్కడి నుండి మొదలు అవుతుందనీ హెచ్చరించారు.



