Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీడీవో సవితారెడ్డికి సన్మానం

ఎంపీడీవో సవితారెడ్డికి సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ మండలానికి బదిలీపై వచ్చి ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన సవితారెడ్డిని మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వినోద్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఉపసర్పంచ్‌లు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఉపసర్పంచ్‌ల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా తగిన ప్రాధాన్యత కల్పించాలని ఎంపీడీవోను కోరారు. అనంతరం ఎంపీడీవోను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి రాజిరెడ్డి, జిల్లా కోశాధికారి శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, రమేష్, జీవన్, వడ్ల స్వామి, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -