ఫిలింనగర్ కల్చరల్ సెంటర్, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం శుక్రవారం ఎఫ్ఎన్సిసిలో సందడిగా జరిగింది. ఈ నెల 4, 5 తేదీలలో ప్రారంభమయ్యే ఈ లీగ్ వచ్చే నాలు గైదు వారాలు వీకెండ్స్‌లో శని, ఆదివారాలు నిర్వహించ నున్నారు. దేశవ్యాప్తంగా టాప్ 10 మెన్ అండ్ ఉమెన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఈ లీగ్‌లో పాల్గొనబోతున్నారు.
ఎఫ్ఎన్ సిసి ప్రెసిడెంట్ కె.ఎస్. రామారావు మాట్లాడుతూ, ‘తెలంగాణ బ్యాట్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీనాథ్, ఎఫ్ఎన్ సిసి బ్యాడ్మింటన్ కమిటీ ఛైర్మన్ పురుషోత్తం చొరవతో ఎఫ్ఎన్సిసి – పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభిస్తున్నాం. క్రికెట్‌తో పాటు బ్యాడ్మిం టన్ లాంటి ఇతర క్రీడలను ప్రోత్సహించాలి, యువతను అన్ని స్పోర్ట్స్ వైపు తీసుకెళ్లాలి అనే ప్రయత్నంలో భాగంగా ఈ లీగ్ నిర్వహిస్తున్నాం. మా ఎఫ్ఎన్సిసి నుంచి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ..ఇలా టీమ్స్ ఉంటాయి. ఇక నుంచి ఎఫ్ఎన్సిసిలో ఏటా టెన్నిస్, బ్యాడ్మింటన్, పికిల్ బాల్ వంటి పోటీలు నిర్వహించబోతున్నాం’ అని అన్నారు.
‘మా ఎఫ్ఎన్సిసిలో టోర్నమెంట్ పెట్టి నాలుగైదేళ్లవుతోంది. అందుకే మా సభ్యుల సూచన మేరకు మొదట క్లబ్ టోర్న మెంట్, ఆ తర్వాత ఇంటర్ క్లబ్ టోర్నమెంట్, ఆ తర్వాత నేషనల్స్ టోర్నమెంట్ నిర్వహించాలని అనుకున్నాం’ అని ఎఫ్ఎన్ సిసి బ్యాడ్మింటన్ కమిటీ ఛైర్మన్ పురుషోత్తం చెప్పారు. ‘సోర్ట్స్‌ను ఎంకరేజ్ చేసేందుకు ఎఫ్ఎన్సిసి కార్యవర్గం ఎప్పుడూ ముందుంటుంది. నేషనల్ వైడ్ టాప్ 10 మెన్ అండ్ ఉమెన్ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్లో పాల్గొంటారు. మేనేజ్ మెంట్ తరుపున ప్రెసిడెంట్, సెక్రటరీ టీమ్స్ ఉంటాయి. పురుషోత్తంతో పాటు ఎవరైనా టీమ్స్ పాల్గొంటే 10 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలి. అవి ఈ టోర్నమెంట్ విజేతలకు ప్రైజ్ మనీ ఇచ్చేందుకు ఉపయోగిస్తాం’ అని తెలంగాణ బ్యాట్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీనాథ్ చెప్పారు.
బ్యాడ్మింటన్‌లో యువతను పోత్సహించేలా..
- Advertisement -
- Advertisement -



