హైదరాబాద్ : ప్రముఖ డిజైన్ ఫెస్టివల్ ‘డిజైన్ డెమోక్రసీ’ తన నాలుగో ఎడిషన్‌ను సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించ నున్నట్లు ప్రకటించింది. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్, ఫర్నిచర్ రంగాలకు వేదికగా నిలిచే ఈ ప్రదర్శనలో 200కు పైగా బ్రాండ్లు, 150 మందికి పైగా నిపుణులు పాల్గొననుండగా, 30,000 మందికి పైగా సందర్శకులు హాజరవుతారని సంస్థ సహ-వ్యవస్థాపకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. కాన్వాస్, మ్యూజ్, అటెలియర్, ఆల్కెమీ అనే నాలుగు హాళ్లలో ‘మ్యూజియం ఆఫ్ తెలంగాణ’తో పాటు అల్ఫాజ్ మిల్లర్, సుసానే ఖాన్ వంటి ప్రముఖుల ప్యానెల్ చర్చలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయన్నారు. భారతీయ డిజైన్ భవిష్యత్తును తీర్చిదిద్దే సృజనాత్మక పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఎడిషన్‌ను నిర్వహిస్తున్నామన్నారు.



