Wednesday, August 19, 2026
E-PAPER
Homeజిల్లాలుఉత్తమ ఎమ్మార్వోకు ఘన సన్మానం

ఉత్తమ ఎమ్మార్వోకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
తహశీల్దార్ రాజశేఖర్‌ ఇటీవలే ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక డబుల్‌ బెడ్‌ రూం నివాసకులు బుధవారం తహశీల్దార్‌ ను మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్ష‍లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ,రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతూ, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న ఎమ్మార్వో రాజశేఖర్ కు ఉత్తమ సేవా ప్రశంసా పత్రం లభించడం గర్వకారణమన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు చేస్తున్న కృషిని అభినందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం తహశీల్దార్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రియాజ్ హన్మండ్లు, బాలరాజ్, అతిక్, సాయిలు, అఫోరోజ్, అంజిరామ్, కాలనీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -