నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ తో పాటు తదితర విభాగాల్లో కలిపి మొత్తం 7,437 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం5 వరకు కొనసాగనుంది. అభ్యర్థులు ముందుగా www.tgprb.in వెబ్‌సైట్‌లో తమ మొబైల్ నంబర్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు గరిష్ట వయస్సును రెండేళ్లు సడలిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా ఉత్తర్వుల ప్రకారం కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయస్సు 29 ఏళ్లకు పెరగనుండగా..ఎస్సై పోస్టులకు గరిష్ట వయస్సు 32 ఏళ్లకు పెరగనుంది. దీనికి అదనంగా ఆయా రిజర్వేషన్ కేటగిరీ వారీగా అదనపు సడలింపు వర్తిస్తుంది.
నేటి నుంచి పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



