Thursday, August 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు 

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – చండూరు  
భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్‌ గాంధీ 82వ జయంతి వేడుకలను గురువారం బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు ఐతరాజు మల్లేష్ ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ప్రధానిగా రాజీవ్‌ గాంధీ అందించిన సేవలను, ఆధునిక సాంకేతిక రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషిని వారు స్మరించుకున్నారు. ముఖ్యంగా సమాచార సాంకేతికత, టెలికమ్యూనికేషన్స్‌ రంగాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ప్రగతికి పునాదులు వేశాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోలు వెంకటరెడ్డి, కోడిగిరి బాబు, కోడి వెంకన్న,సజావుద్దీన్, సోంలింగస్వామి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కట్ట బిక్షం, భూతరాజు ఆంజనేయులు, సాఫీడి  రాములు, ఇరిగి రాజు, అశోక్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ నెంబర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -