- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి
ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సర్పంచ్ ఎర్రల జానకి ప్రజలను కోరారు. గురువారం మండల పరిధిలోని గాగీళ్లపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన వన మహోత్సవంలో సర్పంచ్ జానకి గ్రామస్తులకు ఇంటింటా 5 మొక్కలు పంపిణి చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



